బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్, బండి సంజయ్ కు లేఖ

Telangana Activist Dasoju Sravan Resigns to BJP Resignation Letter Sent to BJP Telangana Chief Bandi Sanjay, Telangana Activist Dasoju Sravan, Dasoju Sravan Resigns to BJP, Resignation Letter Sent to BJP, Mango News, Mango News Telugu, BJP Leader Dasoju Sravan Quits Party, Dasoju Sravan Quits BJP Party, BJP Munugode By Election, Mango News, Mango News Telugu, Telangana Chief Bandi Sanjay Kumar, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

తెలంగాణ ఉద్యమకారుడు, కీలక నేత దాసోజు శ్రవణ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. చాలా కాలం పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాసోజు శ్రవణ్ గత ఆగస్టులోనే బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా శుక్రవారం ఉదయం దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారు.

“తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం అనిశ్చితమైన దశ దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తాం అని చెప్పిన మీరు, మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరిస్తున్న రాజకీయ తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉంది. సామాజిక బాధ్యత లేకుండా ఎన్నికలు అనగానే డబ్బు సంచులు గుప్పించాలన్నట్లుగా బడా కాంట్రాక్టర్లే రాజ్యాలేలాలే, పెట్టుబడి రాజకీయాలు చేయాలన్నట్లుగా కొనసాగిస్తున్న వైఖరి నాలాంటి బలహీన వర్గాలకు చెందిన నాయకులకు స్థానం ఉండదని తేటతెల్లమైంది. అనేక ఆశలతో ఆశయాలతో నేను బీజేపీలో చేరినప్పటికీ దశాదిశాలేని నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మ రాజకీయాలకు కానీ తెలంగాణ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలో అర్ధమైంది. ప్రజాహితమైన పథకాలతో, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఎన్నికలలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను” అని బండి సంజయ్ కు పంపిన రాజీనామా లేఖలో దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =