నేటి నుంచే టీ20 ప్రపంచకప్-2022 ప్రారంభం, ఇప్పటివరకు టైటిల్ గెలిచిన జట్లు ఏవంటే?

T20 World Cup To be Starts From Today India to Play First Match Against Pakistan on Oct 23, T20 World Cup Starts From Today, India First Match Against Pakistan, Ind VS Pakistan, Mango News, Mango News Telugu, India Vs Pakistan Today, India Vs Pakistan Live Score, India Vs Pakistan World Cup 2022, India Vs Pakistan World Cup, India Vs Pakistan Match, India Vs Pakistan Match Live News, India Vs Pakistan Match Latest News And Updates, Ind VS Pakistan News And Live Updates

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచ కప్ నేటినుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా, రేపటి నుంచి తొలి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. కాగా మొత్తం టోర్నీ ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలలో జరుగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 13న జరుగనుంది. ఇక ప్రధాన రౌండ్ మ్యాచ్‌ల సూపర్ 12 రౌండ్ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లు నేరుగా సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 8 జట్లు నేరుగా సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధించాయి. అయితే మిగిలిన 4 స్థానాలను నిర్ణయించే తొలి రౌండ్‌లో మాజీ ఛాంపియన్‌లు శ్రీలంక మరియు వెస్టిండీస్‌లు ఉండటం విశేషం. కాగా రౌండ్ 1లో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. ఇందులో గ్రూప్ Aలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక మరియు యూఏఈ ఉన్నాయి. ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ మరియు జింబాబ్వే గ్రూప్ Bలో ఆడుతున్నాయి.

రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో, ప్రతి డివిజన్ నుండి ఒక జట్టు 3 ఇతర జట్లతో ఆడుతుంది. సూపర్ 12 రౌండ్‌కు, ప్రతి విభాగంలో టాప్ 2 జట్లు అర్హత సాధిస్తాయి. సూపర్ 12 రౌండ్‌లో 6 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు 2 క్వాలిఫైయింగ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, 2 క్వాలిఫైయింగ్ జట్లు ఉంటాయి. ప్రతి జట్టు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఇతర జట్లతో ఒకసారి ఆడుతుంది. మొదటి రౌండ్ నుండి, శ్రీలంక, వెస్టిండీస్, నెదర్లాండ్స్ మరియు జింబాబ్వేలు సూపర్ 12 రౌండ్‌కు అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. రేపు జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. అయితే ఆసియా కప్ గెలిచిన ఊపులో ఉన్న శ్రీలంక విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా వారం ముందే ఆస్ట్రేలియా చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడింది. ఇక తన మొదటి మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ గేమ్ గురించి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని, ఎందుకంటే అందరి కళ్లు ఈ మ్యాచ్‌పైనే ఉంటాయని తమకు తెలుసనీ చెప్పాడు. అయితే ఇరు జట్ల ఆటగాళ్లు ఎదురుపడినప్పుడు మాత్రం తమ మధ్య ఆటకు సంబంధించిన మాటలు రావని, వారు ఎలా ఉన్నారు? వారి ఫ్యామిలీ ఎలా ఉందని? ఎలాంటి కార్లు కొంటున్నారు? ఇలాంటి మాటలే వస్తాయని చెప్పారు.

ఇక గాయపడ్డ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని తీసుకోవడంపై రోహిత్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ ముఖ్యమే కానీ, బుమ్రా కెరీర్ అంతకంటే ముఖ్యమని, అతడికి ఇంకా ఎంతో కెరీర్ ఉందని అన్నాడు. అయినా ఆటలో గాయాలు సహజమేనని, అందుకే రిజర్వ్ బెంచ్‌ను బలోపేతం చేసేలా ప్రణాళికలు వేసుకున్నామని తెలిపాడు. అందుకే ఈ సమయంలో బుమ్రా కెరీర్‌ను రిస్కులో పెట్టదలచుకోలేదని, ఇక ఎంతో అనుభవమున్న షమీ త్వరగా లయ అందుకుంటాడని తెలిపాడు. పాక్‌తో మ్యాచ్ కంటే ముందు షమీకి 3 నుంచి 4 బౌలింగ్ సెషన్లు ఉంటాయని, బ్రిస్బేన్ మైదానంలో ఆదివారం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడు ఆడతాడని అన్నాడు.

ఈ మెగా సిరీస్‌లో సూపర్ 12లో టీమిండియా ఆడనున్న మ్యాచ్‌లు:

  • అక్టోబర్ 23: భారత్ x పాకిస్థాన్: సమయం – మధ్యాహ్నం 1:30 pm
  • అక్టోబర్ 27 భారత్ x రన్నరప్ గ్రూప్ A: సమయం – మధ్యాహ్నం 12:30 pm
  • అక్టోబర్ 30 భారత్ x సౌతాఫ్రికా: సమయం – సాయంత్రం 4:30 pm
  • నవంబర్ 2 భారత్ x బంగ్లాదేశ్: సమయం – మధ్యాహ్నం 1:30 PM
  • నవంబర్ 6 భారత్ x విజేత గ్రూప్ B: సమయం – మధ్యాహ్నం 1.30 pm

ఇప్పటివరకు టైటిల్ గెలిచిన జట్లు ఏవంటే?

  • 2007 – ఇండియా
  • 2009 – పాకిస్తాన్
  • 2010 – ఇంగ్లాండ్
  • 2012 – వెస్టిండీస్
  • 2014 – శ్రీలంక
  • 2016 – వెస్టిండీస్
  • 2021 – ఆస్ట్రేలియా

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + five =