చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌పై యూపీ పోలీసుల నజర్

యం 2022 Up Assembly Elections, Bhupesh Baghel, Chhattisgarh CM, Chhattisgarh CM Bhupesh Baghel, Chhattisgarh CM Bhupesh Baghel for Violating Covid-19 Norms, Chhattisgarh CM Bhupesh Baghel for Violating Covid-19 Norms During UP Political Rally, CM Bhupesh Baghel, FIR Against Chhattisgarh, FIR Against Chhattisgarh CM Bhupesh Baghel for Violating Covid-19 Norms During UP Political Rally, Mango News, UP Assembly Elections, UP Assembly Elections 2022, Up Assembly Polls, UP Political Rally

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌పై ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని గౌతమ్‌బుధ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై భూపేష్ బాఘెల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగించాలో ఎన్నికల కమిషన్ డెమో ఇవ్వాలని, అప్పుడు ఈసీ చెప్పినట్టే చేస్తామని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్‌ లోని అమ్రోహిలో 5 రోజుల నుంచి బీజేపీ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోంది. వాళ్లపై ఎందుకు చర్య తీసుకోలేదు. నేను నిన్న ఒక్క రోజు మాత్రమే ప్రచారం చేశాను. ఈసీ నిష్పాక్షికంగా ఉండాలి. నా ఒక్కరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏమిటి? అమ్రోహిలో బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా? దీనివలన నేను వెనక్కి తగ్గను. ప్రచారం కోసం మళ్లీ నేను ఉత్తరప్రదేశ్ వెళ్తాను. రాజకీయ నాయకులు ప్రచారం చేయకుండా ఇంకేం చేయాలి?” అని చత్తీస్‌గఢ్ సీఎం ప్రశ్నలు గుప్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =