కేంద్రం మద్దతు ధర పెంచిన ఆరు రబీ పంటలు ఇవే…

Cabinet approves Minimum Support Prices, Cabinet approves MSPs for Rabi Crops, Minimum Support Prices for 6 Rabi Crops, MSP for Rabi Crops for marketing, Rabi Crops, Rabi Crops for Marketing, Rabi Crops for Marketing Season 2021-22, Union Cabinet, Union Cabinet Approves Minimum Support Prices, Union Cabinet Decisions

దేశవ్యాప్తంగా 2021-22 మార్కెట్ సీజన్‌లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సమావేశమైన పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచినట్టు పేరొన్నారు. అలాగే కనీస మద్దతు ధర పెంపుపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో ప్రకటన కూడా చేశారు.

కనీస మద్దతు ధర పెరిగిన పంటలివే:

  • గోధుమలపై కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.50 పెంపు – ధర రూ.1975 గా నిర్ణయం
  • బార్లీపై రూ.75 పెంపు – ధర రూ.1600 (క్వింటాల్‌కు)
  • ఆవాలుపై రూ.225 పెంపు – ధర రూ.4650
  • మసూర్(లెంటిల్) పప్పుపై రూ.300 పెంపు – ధర రూ.5100
  • కుసుమలపై రూ.112 పెంపు – ధర రూ.5327
  • కందులపై రూ.225 పెంపు – ధర రూ.5100

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fourteen =