జాతీయ ఓటర్ల దినోత్సవం: డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డులు ఆవిష్కరణ

Digital Voter ID Card on National Voters Day, Digital voter ID cards, Digital Voter-ID E-EPIC, ECI to Launch Digital Voter-ID, Election Commission, EPIC Programme, Initiative To Make Voter IDs Digital In India, Mango News, National Voters Day, National Voters Day 2021, Ravi Shankar Prasad Launches Digital Voter ID Card, Union Minister Ravi Shankar Prasad, voter IDs to go digital from today

దేశంలో డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు (ఈ-ఈపిఐసీ) అందుబాటులోకి వచ్చాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం నాడు కేంద్ర న్యాయ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఓటరు గుర్తింపు కార్డు యొక్క డిజిటల్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఇకపై ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డు యొక్క డిజిటల్ కాపీని డౌన్‌లోడ్ చేసుకొని, డిజి-లాకర్‌లో అప్‌లోడ్ చేసి సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) జారీచేసే ఈ-ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఈ-ఈపిఐసీ)ని ఎవరూ ఎడిట్ చేయలేరని, అలాగే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ప్రింట్‌ తీసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ తర్వాత ఓటర్లకు జారీ చేసే భౌతిక ఓటర్ గుర్తింపు కార్డుతో పాటుగా డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డు అదనంగా ఉంటుందని తెలిపారు.

ఓటర్లు ఇకపై తమ ఓటరు ఐడి కార్డును స్మార్ట్‌ఫోన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Voter Helpline App మరియు https://voterportal.eci.gov.in/, https://www.nvsp.in/ వెబ్ సైట్స్ ద్వారా డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులు ద్వారా పొందవచ్చు. సాధారణ ఓటర్లు అందరూ తమ డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను ఫిబ్రవరి 1, 2021 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇ-రోల్‌లో యూనిక్ ఫోన్ నంబర్ యాడ్ చేసి లేని వారు డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందు కెవైసి ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుందని చెప్పారు. మరోవైపు భారత ఎన్నికల సంఘం 1950లోనే ఏర్పడిన సంగతి తెలిసిందే. భారత ఎన్నికల సంఘం ఏర్పాటును పురస్కరించుకుని 2011 నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 న దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =