ఎంపీలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, పార్లమెంట్‌లో వ్యూహాలపై దిశానిర్దేశం

Adimulapu Suresh, Andhra Pradesh Government, Andhra Pradesh Government Party Meeting, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan reddy, Chief Minister of Andhra Pradesh, CM YS Jagan Meeting with YSRCP MPs, CM YS Jagan Meeting with YSRCP MPs over Parliament Budget Session, Mango News, Mithun Reddy, parliament session, YCP Party Meeting, YS Jagan Mohan Reddy Conducts Crucial Meeting, YS Jagan Mohan Reddy Conducts Crucial Meeting Ahead Of Parliament Session, YSRCP Government, YSRCP MPs

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి సోమవారం నాడు వైస్సార్సీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. జనవరి 29 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అన్ని పెండింగ్ అంశాలపై ఎంపీలకు అవగాహనా కల్పించి, నిధులు రాబట్టేలా కృషి చేయాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, హైకోర్టును కర్నూలుకు తరలించేలా రీ-నోటిఫికేషన్, విశాఖ రైల్వే జోన్‌, రాష్ట్ర రెవెన్యూ లోటు సహా పలు కీలక అంశాలపై పార్లమెంట్ లో ప్రస్తావించేలా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభ, రాజ్యసభ‌ ఎంపీలు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 15 =