అమెరికాలో కరోనా తీవ్రత, 4 లక్షలు దాటిన కరోనా మరణాలు

America Coronavirus, America Coronavirus Deaths, Coronavirus Cases, Coronavirus Crisis, Coronavirus Deaths In US, Coronavirus outbreak, Coronavirus Pandemic, Coronavirus Precautions, Coronavirus Prevention, Coronavirus Symptoms, COVID 19 Deaths, COVID 19 Deaths In US, US Coronavirus Deaths, US COVID 19 Deaths, US Reports Highest Number Of Casualties, USA

అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ఇప్పటికే అమెరికాలో మరణించిన వారి 4 లక్షలు (4,19,225) దాటింది. అలాగే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా కూడా 2.5 కోట్లు (2,51,28,378) దాటింది. కరోనా నియంత్రణకు అమెరికా ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అమెరికాలో ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌, ఇల్లీనియస్, జార్జియా, ఒహియో, పెన్సిల్వేనియా, అరిజోన, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాలలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

మరోవైపు కరోనా నియంత్రణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 100 డేస్ మాస్క్ ఛాలెంజ్ తో పాటుగా, 100 రోజుల్లో 10 కోట్లమందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే కరోనా వైరస్ పై జాతీయ ప్రతిస్పందనను సమన్వయం చేయడానికి కొత్త ఫెడరల్ ఆఫీస్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + fifteen =