అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. రిపబ్లికన్లు, డెమొక్రాట్‌ల మధ్య టఫ్ ఫైట్

US Midterm Elections 2022 Tough Fight Between Republicans and Democrats To Win Senate, US Midterm Elections 2022,US Midterm Elections,Republicans and Democrats,Mango News,Mango News Telugu,US Elections 2022, Republicans and Democrats To Win Senate, Republicans To Win Senate,Democrats To Win Senate,Republicans,Democrats,USA Republicans, USA Democrats, US Elections, United State Elections

అగ్రరాజ్యం అమెరికాలో మంగళవారం మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్ళ సాధారణ పరిపాలనా కాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రతి రెండేళ్లకోసారి ఇలా ఎన్నికలు జరుపడం అక్కడ ఆనవాయితీ. ఈ నేపథ్యంలో నిన్న దేశంలోని చాలా ప్రాంతాలలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముప్పై ఐదు సెనేట్ సీట్లు మరియు మొత్తం 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీట్లకు ఎన్నిక జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో దాదాపు 46 మిలియన్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అధికార డెమొక్రాట్‌లకు షాక్ తగిలే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన కొన్ని ఫలితాల ప్రకారం.. డెమొక్రాటిక్ నాయకుడు చక్ షుమెర్ మరియు సీనియర్ రిపబ్లికన్ జాన్ థూన్‌తో సహా సెనేట్ సభ్యులు మంగళవారం జరిగిన యూఎస్ మధ్యంతర ఎన్నికలలో తిరిగి ఎన్నికలో విజయం సాధించారు. రిపబ్లికన్లు హౌస్‌లో ఆధిపత్యం చూపడానికి అవసరమైన ఐదు సీట్లను కైవసం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా ప్రతినిధుల సభపై రిపబ్లికన్లకు నియంత్రణ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జో బైడెన్ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. ఇకపై జారీ చేసే ప్రతి బిల్లుకి హౌస్‌లో ఆమోదముద్ర పడాలంటే రిపబ్లికన్ల సహకారం తప్పనిసరి. కాగా ప్రస్తుతం అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు డెమొక్రాట్లపై ఆగ్రహంతో ఉన్నారని రాజకీయ పరిశీలకుల అంచనా.. ఏదేమైనా మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =