ఈ నెల 11న గుంటూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Mohan Reddy To Visit Guntur District on November 11th,AP CM YS Jagan Mohan Reddy,AP CM YS Jagan Mohan Reddy Tour in Vizag, Mango News,Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy Guntur Tour, Jagan Mohan Reddy Guntur Tour Scheduled, Jagan Mohan Reddy will Visit Guntur, Prime Minister Modi Visakhapatnam Tour, Chief Minister Guntur Tour, Guntur Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 11వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాలో చేపట్టనున్న పలు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరవనున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలో ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అలాగే ఒకప్పటి ఉమ్మడి గుంటూరు, ప్రస్తుత పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలంలో స్పైసెస్‌ పార్కులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను కూడా సీఎం జగన్ ప్రారంభిస్తారని సమాచారం.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, మొహమ్మద్ ముస్తఫా తదితరులు సీఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సంబంధిత అధికారులతో కీలక సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి, జిఎంసి కమిషనర్ కీర్తి చేకూరి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, అధికారుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. ఇక పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, ఎస్సీ రవిశంకర్‌రెడ్డిలు పార్కులో హెలిప్యాడ్‌ ఏర్పాటును పర్యవేక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =