టెస్టు సారథ్యానికి విరాట్‌ కోహ్లీ రాజీనామా

cricket, india test captain 2022, India Test cricket captain, indian cricket team captain 2021, indian cricket team captain list, Mango News, odi captain of india, Twitter Reacts As Virat Kohli Steps Down, Virat Kohli, Virat Kohli Quits As Team India’s Test Captain, Virat Kohli steps down as India Test captai, Virat Kohli steps down as India Test cricket captain, Virat Kohli Steps Down as India’s Test Captain, Virat Kohli Steps Down as Team India’s Test Captain

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీ్‌సను ఓడిన మరుసటి రోజు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పిన విషయం యావత్ ఇండియా క్రికెట్ ను కుదిపేసింది. టెస్టు ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్టు సోషల్‌ మీడియాలో అతడు చేసిన ప్రకటనతో క్రీడాలోకం ఉలిక్కి పడింది. ద్వితీయ శ్రేణితో కూడిన దక్షిణాఫ్రికాపై ఈసారి భారత జట్టు సిరీస్‌ గెలుస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. ఈక్రమంలోనే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

భారత క్రికెట్‌ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ గా పేరు తెచ్చుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీ్‌స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. ఆటలోనే కాదు జట్టును ముందుండి నడిపించడంలోనూ దూకుడుగా వ్యవహరించటం కోహ్లీ నైజం. విదేశాల్లో ఎక్కువ విజయాలు అందించిన నాయకుడుగా నిలిచిన విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి నిష్క్రమించిన తీరు అభిమానులను, క్రీడా వర్గాలను షాక్‌కు గురిచేసింది. కేవలం, నాలుగు నెలల వ్యవధిలోనే మూడు ఫార్మాట్ల సారథ్యానికి దూరమయ్యాడు కోహ్లీ.

దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్‌ సిరీస్‌ ఓటమి అనంతరం సారధ్య బాధ్యతలకు గుడ్‌బై చెబుతూ సంచలన ప్రకటన చేసిన విరాట్‌ కోహ్లి.. తాను తీసుకున్న నిర్ణయం వెనుక గల కారణాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన లేఖలో తెలియజేసాడు. జట్టును సరైన దిశలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహకారాన్ని అందించానని కోహ్లి అన్నాడు. తాజాగా కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. జట్టు కోసం నిజాయితీగా కష్టపడ్డానని, జట్టుకు కరెక్ట్‌ కానిది తాను ఎట్టి పరిస్థితుల్లో చేయలేనని, తన నిర్ణయంపై పూర్తి క్లారిటీతో ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు.

తన ఏడేళ్ల టెస్ట్‌ కెప్టెన్సీ కెరీర్‌లో వందకు 120 శాతం కష్టపడ్డానని, అలా చేయలేని పక్షంలో టీమిండియా కెప్టెన్‌ హోదాలో కొనసాగడం కరెక్ట్‌ కాదని భావిస్తున్నానని 33 ఏళ్ల కోహ్లీ స్పష్టం చేశాడు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. మాజీ కోచ్‌ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్‌ ధోనిల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాగా, 2014లో ధోని నుంచి టెస్ట్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. 68 మ్యాచ్‌ల్లో టీమిండియా సారధిగా వ్యవహరించి 40 మ్యాచ్‌ల్లో జట్టును విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో ఎన్నో అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు సాధించి, మరే ఇతర భారత కెప్టెన్‌ సాధించనన్ని టెస్ట్‌ విజయాలు సాధించాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =