అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్

West Indies All Rounder Kieron Pollard Retires from International Cricket, Kieron Pollard Retires from International Cricket, The legendary West Indies all-rounder Kieron Pollard has announced his retirement from international cricket, Kieron Pollard has announced his retirement from international cricket, The legendary West Indies all-rounder Kieron Pollard, West Indies all-rounder Kieron Pollard, West Indies all-rounder Kieron Pollard has announced his retirement from international cricket, international cricket, all-rounder Kieron Pollard, Kieron Pollard, West Indies white-ball captain Kieron Pollard announced his retirement from international cricket, white-ball captain Kieron Pollard, white-ball captain, Former West Indies captain Kieron Pollard announced retirement from international cricket, Kieron Pollard Retires from IC News, Kieron Pollard Retires from IC Latest News, Kieron Pollard Retires from IC Latest Updates, Mango News, Mango News Telugu,

వెస్టిండీస్ సీనియర్ బ్యాట్స్‌మెన్, పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లుగా బుధవారం నాడు కీరన్ పొలార్డ్ ప్రకటన చేశాడు. 2007వ సంవత్సరంలో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కి అడుగుపెట్టిన పొలార్డ్, 15 సంవత్సరాలపాటుగా వెస్టిండీస్ క్రికెట్ కు సేవలు అందించాడు. ‌అయితే పొలార్డ్ ఎప్పుడూ టెస్ట్ క్రికెట్ ఆడలేదు. అలాగే 2012 ఐసీసీ T20 ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. పొలార్డ్ 2019 నుంచి వెస్టిండీస్ వన్డే మరియు టీ20 జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పొలార్డ్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌ను రెండు ఫార్మాట్లలో కలిపి 61 మ్యాచ్‌ లు ఆడగా 25 మ్యాచుల్లో గెలిచారు మరియు 31 మ్యాచుల్లో ఓడిపోయారు.

వెస్టిండీస్ తరపున మొత్తం 123 వన్డేలు, 101 టీ20 మ్యాచుల్లో కీరన్ పొలార్డ్ ఆడాడు. 123 వన్డేల్లో 2706 పరుగులు చేయగా, 55 వికెట్లు తీశాడు. 101 టీ20ల్లో 1569 పరుగులు చేయగా, 42 వికెట్లు తీశాడు. 1569 పరుగుల్లో 99 సిక్స్ లు ఉన్నాయి. పలు మ్యాచుల్లో బౌలింగ్ లో సైతం రాణిస్తూ ఆల్ రౌండర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కాగా పొలార్డ్ తన చివరి అంతర్జాతీయ సిరీస్ ను భారత్ తోనే ఆడాడు.

రిటైర్మెంట్ పై కీరన్ పొలార్డ్ స్పందిస్తూ “జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే, నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను 10 ఏళ్ల వయస్సు నుండి వెస్టిండీస్‌కు ఆడాలనేది నా కల మరియు 15 ఏళ్లకు పైగా టీ20 మరియు వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. నా చిన్ననాటి హీరో బ్రియాన్ లారా నాయకత్వంలో 2007లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేయడం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ఆ మెరూన్ రంగులు ధరించడం మరియు అలాంటి గొప్పవారితో కలిసి ఆడడం నేను ఎప్పుడూ తేలికగా తీసుకోని ఒక విశేషం, నా హృదయాన్ని మరియు ఆత్మను ఆట యొక్క బౌలింగ్, బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్.. ఇలా ప్రతి కోణంలోనూ అందించాను” అని పేర్కొన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =