చైనాలో ఆర్థిక మాంద్యం.. సంచలన విషయాలు వెల్లడించిన షీ జిన్‌పింగ్

Economic Recession In China Xi Jinping Revealed Sensational Things, Economic Recession In China, Xi Jinping Revealed Sensational Things, Recession In China, China, Econimic Recession, XI Jinping, Latest China Economic Recession News, Latest China Economic Recession Update, Latest China News, China Economic News, World Economic News, Mango News, Mango News Telugu
China, Econimic Recession, XI Jinping,

డ్రాగన్ కంట్రీ చైనా ఆర్థిక మాంద్యంతో అల్లాడిపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ డీలా పడటం మొదలయింది. చైనాలోని వాణిజ్య, వ్యాపారాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య చైనాను వేదిస్తోంది. అయితే చైనా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. తొలిసారి ఆర్థిక మాంద్యంపై స్పందించారు.

నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి షీ జిన్ పింగ్ ప్రసంగించారు. ఈ క్రమంలో తొలిసారి చైనా ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. దేశ ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. దేశంలోని వాణిజ్య, వ్యాపార రంగాలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. నిరుద్యోగులు ఉద్యోగాలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. నిరుద్యోగ సమస్య దేశాన్ని వేదిస్తోందని చెప్పుకొచ్చారు.

దేశ ఆర్థిక పరిస్థితిపై ఆలోచిస్తున్నామని.. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు దారులను వెతుకుతున్నామని షీ జిన్ పింగ్ వెల్లడించారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి.. బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. చైనాను తిరిగి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని వివరించారు.

ఇక అంతకంటే ముందు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్.. పర్చేజింగ్ మేనేజర్స్‌ ఇండెక్స్‌కు (పీఎంఐ) సంబంధించి సంచలన నివేదికను విడుదల చేసింది. డిసెంబర్‌లో చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయని ఆ నివేదికలో తేలింది. నవంబర్‌లో 49.4గా ఉన్న పీఎంఐ.. డిసెంబర్‌లో 49కి పడిపోయిందని వివరించింది. సెప్టెంబర్ వరకు 50 కంటే ఎక్కువగా ఉన్న పీఎంఐ.. ఆ తర్వాత నుంచి తగ్గూతూ వస్తోందని నివేదిక వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − two =