ఐపీఎల్‌ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, 971 Players Registered For IPL 2020, IPL 2020 Auction, IPL 2020 Latest Updates, IPL 2020 Player Auction, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news, VIVO IPL 2020 Player Auction

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 సీజన్‌ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 19న కోల్‌కతాలో జరగబోయే ఈ వేలానికి నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 713 మంది భారతీయులు కాగా, 258 మంది విదేశీ ఆటగాళ్లు. ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు నవంబర్ 30తో ముగిసింది. ఈ 971 మంది ఆటగాళ్ళలో 215 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 754 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) మరియు ఇద్దరు అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు. వేలానికి అందుబాటులో ఉన్న భారత్ ఆటగాళ్లలో 19 మంది జాతీయ జట్టుకు ఆడగా, 634 మంది ఇంతవరకు భారత్ జట్టు తరఫున ఆడలేదు. మిగిలిన 60 మంది ఇప్పటికే ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ అయినా ఆడి ఉన్నారు. మొత్తం 971 మంది ఆటగాళ్ల నుంచి, ఎనిమిది ఫ్రాంచైజీలు కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను డిసెంబర్‌ 9వ తేదీ లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు సమర్పించిన షార్ట్ లిస్ట్ లో ఉన్న ఆటగాళ్లకి మాత్రమే వేలంలో చోటు దక్కుతుంది. ఐపీఎల్‌ 2020 సీజన్లో ప్రస్తుతం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73 మంది క్రికెటర్లను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here