బంగ్లాదేశ్ తో టి20, టెస్టు సిరీస్ లకు భారత జట్ల ప్రకటన

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, BCCI Announced T20 And Test Squad, BCCI Announced T20 And Test Squad For Bangladesh, BCCI Announced T20 And Test Squad For Bangladesh Series, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news, Test Squad For Bangladesh Series

త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టి20, టెస్టు సిరీస్ లకు భారత జట్టును ప్రకటించారు. ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను అక్టోబర్ 24, గురువారం నాడు విడుదల చేసారు. ముందుగా అందరూ అనుకున్నట్టే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు విశ్రాంతి నిచ్చారు. బంగ్లాదేశ్ తో జరిగే టి20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. టి20 జట్టులో కొత్తగా ఇద్దరికీ చోటు లభించింది, ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీతో రాణించిన కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్ మరోసారి టీంలో చోటు దక్కించుకోగా , ముంబై ఆటగాడు శివమ్‌ దూబే మొదటిసారిగా భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే టెస్టు జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా కుల్ దీప్ యాదవ్‌ గాయపడడంతో అతని స్థానంలో వచ్చి నాలుగు వికెట్లతో రాణించిన షాబాజ్‌ నదీమ్‌ ను బంగ్లాదేశ్ తో సిరీస్ కు ఎంపిక చేయలేదు. కుల్ దీప్ కోలుకోవడంతో సెలెక్టర్లు మళ్ళీ అతడికే అవకాశం ఇచ్చారు. నవంబర్ 3,7, 10 తేదీలలో టి20 మ్యాచులు జరుగుతాయి. అదేవిధంగా నవంబర్ 14 న ఇండోర్ లో తొలిటెస్టు, నవంబర్ 22 న కోల్ కతా లో రెండో టెస్టు జరగనున్నాయి.

బంగ్లాదేశ్‌తో జరిగే టీ 20 సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, క్రునాల్ పాండ్యా, యజేంద్ర చాహల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివం దూబే, శార్దుల్ ఠాకూర్

బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారీ, సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ శర్మ, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =