ఈడీ విచారణకు హాజరైన గాలి జనార్ధన్ రెడ్డి

ED grills Janardhan Reddy in illegal mining case, ED Interrogation Attended by Gali Janardhan Reddy, ED Officers Interrogate Gali Janardhan Reddy, Gali Janardhan Reddy Attends For ED Interrogation Today, Gali Janardhan Reddy ED Interrogation Latest News, Mango News, Mining baron Janardhana Reddy Attends For ED Interrogation

ఓబులాపురం మైనింగ్ కు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విచారణ కోసం హాజరయ్యారు. ఈడీ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డిని బషీర్ బాగ్ లోని కార్యాలయంలో విచారించారు. ఉదయం 11 గంటలకు ఈ విచారణ మొదలైంది, ఓబులాపురం అక్రమ మైనింగ్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, ఇతర అంశాలపై అధికారులు ప్రశ్నించారు.

విదేశాలకు తరలించిన డబ్బు లావాదేవీలపై వివరణ కోరినట్టు సమాచారం. 2007 లో అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి పై సిబిఐ అధికారులు కేసు నమోదు చేసారు. కేసు పరిశీలనలో భారీగా మనీ లాండరింగ్ కి పాల్పడినట్టు అభియోగాలు నమోదు కావడంతో ఈడీ ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి ని విచారించినట్టు సమాచారం. మరో వైపు ఓబులాపురం మైనింగ్ కు సంబంధించి కర్ణాటక హైకోర్టు అన్నికేసులు కొట్టివేసింది అని, ఈడీ ఈ కేసులో జప్తు చేసిన రూ. 1000 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరినట్టు గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు, అలా ఇవ్వని పక్షంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=N36xy-MbCDQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − ten =