భారత్ VS న్యూజిలాండ్ సెమీ ఫైనల్ నేడే

India vs Newzealand Cricket WorldCup 2019 Semi Final Match Updates,Mango News,ICC Cricket World Cup 2019,India vs New Zealand Live Score,World Cup 2019 Semi-Final Live Score Updates,India vs New Zealand Manchester Weather Forecast World Cup 2019,ICC Cricket World Cup 2019 Match Between India vs New Zealand,ICC Cricket World Cup 2019 India vs New Zealand 1st Semifinal
  • కీలకం కానున్న టాస్
  • గ్రూప్ దశలో వర్షం వలన న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు, మొదటిసారి న్యూజిలాండ్ తో పోరు
  • ఇదే గ్రౌండ్ లో పాకిస్తాన్, వెస్టిండీస్ పై భారత్ ఘన విజయాలు

క్రికెట్ ప్రపంచకప్ 2019 లో ఈ రోజు జరుగుతున్న తోలి సెమీఫైనల్ లో భారత్ జట్టు, న్యూజిలాండ్ తో తలపడుతుంది, ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఈ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది, మధ్యాహ్నం 3 గంటల నుండి మ్యాచ్ మొదలవుతుంది. క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఏంతో ఆశక్తితో ఎదురుచూస్తున్నారు, ఈ ప్రపంచకప్ లో భారత్ అద్భుత ఆటతీరుతో ముందుకు సాగుతుంది, గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా, మిగిలిన అన్ని మ్యాచ్ లలో అంచనాలకు తగ్గట్టు ఆడి విజయాలు సాధించారు.
వాతావరణ సూచన ప్రకారం, వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి,కొంత సమయం పాటు జల్లులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మాంచెస్టర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా. భారత్ మరియు న్యూజిలాండ్ కాకుండా, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. జులై 11న జరిగే మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ తలపడనున్నాయి.

నేడు జరిగే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, ఎం.ఎస్. ధోని, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, చాహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి, అదే విధంగా న్యూజిలాండ్ జట్టులో హెన్రీ నికోలస్, మార్టిన్ గుప్టిల్,కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జేమ్స్ నీషామ్, మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్, లాకీ ఫుర్గూసన్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ మరియు ట్రెంట్ బౌల్ట్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here