ఆఖరి టెస్టు గెలిచి యాషెస్ సిరీస్ ను 2-2 తో సమం చేసిన ఇంగ్లాండ్

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, England Beat Australia In Fifth Test, England Beat Australia In Fifth Test And Draws The Ashes Series, England Beat Australia In Fifth Test Series, England Vs Australia, England Vs Australia Test Series, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news

యాషెస్ సిరీస్ లో ఆఖరిదైనా ఐదో టెస్టులో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ గెలిచి చాలా సంవత్సరాలు అవుతుంది. 2001 లో స్టీవ్ వా నేతృత్వంలో ఇంగ్లాండ్ లో యాషెస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఈసారి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఐదో టెస్టులో 399 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమి పాలయింది. చివరిసారిగా 1972 లో డ్రా గా ముగిసిన యాషెస్ సిరీస్, మళ్ళీ 47 సంవత్సరాల తరువాత అదే ఇంగ్లాండ్ లో మరోసారి డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఆడిన నాలుగు టెస్టుల్లో 774 పరుగులు చేసి ఈ సిరీస్ లో ఆ జట్టు తరుపున కీలక పాత్ర పోషించాడు.

ఐదో టెస్టు తోలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 294 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 225 పరుగులకే కుప్పకూలిపోయింది. తోలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్ జొఫ్రా ఆర్చర్ 6 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 329 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడంతో ఆస్ట్రేలియా ముంగిట 399 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. 399 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా వరుస వికెట్లు కోల్పోగా, మాథ్యూ వాడే 117 పరుగులతో ఒంటరి పోరాటం చేసాడు. సిరీస్ లో అద్భుతంగా రాణించిన స్టీవ్ స్మిత్ 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్ చెరో నాలుగు 4 వికెట్లు పడగొట్టారు. ఈ యాషెస్ సిరీస్ లో మొదటి టెస్టు ఆస్ట్రేలియా గెలువగా, రెండో టెస్టు వర్షం వలన డ్రాగా ముగిసింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మళ్ళీ ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో యాషెస్ సిరీస్ 2-2 తో సమం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 18 =