220 కోట్ల మందికి హీట్ స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం

220 Crore People Are At Risk Of Heat Stroke And Heart Attack,Heat Cause A Heart Attack,Heat Cause A Stroke,Extreme Heat And Pollution,Mango News,Mango News Telugu,Heat Induced Heart Attack,Heart Problems And The Heat,Risk Of Fatal Heart Attack,Summer Heat And Heart Attacks,Heat Waves Might Increase Heart Attack,Extreme Heat Cause A Heart Attack,Can Heat Cause Heart Palpitations,Heart Attack Causes,Heart Attack News,Heart Attack News India,Severe Heart Attack,Heart Attack

మారిపోతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం మారిపోతుంది. దీంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలుతో పాటు భయంకరంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. గ్లోబల్‌ టెంపరేచర్‌కు సంబంధించిన తాజా పరిశోధన ఇదే విషయాన్ని వెల్లడించింది.

గ్లోబల్‌ టెంపరేచర్‌ ప్రపంచవ్యాప్తంగా 2 డిగ్రీల సెల్సియస్‌ పెరగనుందని.. దీని ప్రభావం భారత్‌, పాకిస్థాన్‌తో పాటు.. ఎన్నో దేశాలపై పడనుందని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌కు చెందిన 220 కోట్ల మందికి పైగా ప్రజలు భయంకర వేడిని ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా పరిశోధన చెబుతుంది. అయితే ఈ పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజల్లో హీట్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందనే విషయాన్ని తాజా పరిశోధన తెలిపింది. మెయిన్‌గా ఉత్తర భారతదేశంతో పాటు, తూర్పు పాకిస్తాన్, తూర్పు చైనా, సబ్-సహారా ఆఫ్రికాలో ఎక్కువ తేమతో కూడిన వేడిని ఎదుర్కోవలసి వస్తుందని వెల్లడిస్తోంది.

పీఎన్‌ఏఎస్ అంటే పీర్ రివ్యూడ్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం..ఉష్ణోగ్రత పెరిగితే ఉత్తర భారతదేశంతో పాటు తూర్పు పాకిస్తాన్, తూర్పు చైనా, సబ్ సహారా ఆఫ్రికా దేశాలలోని ప్రజలు ఎక్కువ తేమతో కూడిన హీట్‌వేవ్‌లను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితులను ఫేస్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తాజా పరిశోధన వెల్లడించింది.

ఎందుకంటే వాతావరణ మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతాదని పరిశోధనల్లో తేలింది. దీనిలో ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే భూ ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత.. ఇప్పటికే సుమారు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుంచి కూడా ఈ ఉష్టోగ్రతలో పెరుగుదల ఉందని పరిశోధన పేర్కొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలో వాతావరణంలోకి సీఓటూ అంటే కార్బన్ డయాక్సైడ్ విడుదల అయ్యే శాతం ఎక్కువగా ఉందని.. దీని ప్రభావంతోనే ఉష్ణోగ్రత పెరగడం ముడిపడి ఉందని వెల్లడించింది.

నిజానికి వాతావరణ మార్పుపై 2015లోనే 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను నివారించడంతో పాటు.. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడంగా ఆయా దేశాలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. అయినా కూడా టెంపరేచర్ పెరుగుదలలో అదుపు లేదంటూ గతంలోనే ఐపీసీసీ అంటే.. ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ హెచ్చరించింది. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచం మొత్తం మీద దాదాపు 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐపీసీసీ సంస్థ చెబుతోంది.

అయితే ఇలాంటి వాతావరణ మార్పుతో తలెత్తే ఇలాంటి భయంకర పరిస్థితులను తగ్గించడానికి అలాగే వినాశకరమైన ప్రభావాన్ని నివారించడానికి కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా 2019 తో పోలిస్తే 2030 నాటికి ప్రపంచంలోని ఉద్గారాలను సగానికి సగం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఐపీసీసీ సూచించింది. ఇలా చేస్తేనే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను అదుపు చేయొచ్చని.. అలా అయితే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయొచ్చని తెలిపింది. ఇప్పటికే జూన్, జులై, ఆగస్టు ,సెప్టెంబర్‌ నాలుగు నెలల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని గ్లోబల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, 2023 ఎన్నడూ లేని విధంగా అత్యంత వేడిగా భూమి మారిందని..ఇంకా వేడిగా మారుతుందని ఐపీసీసీ హెచ్చరిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =