ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా, ఢిల్లీలో ప్రారంభమైన ఆయన బహుమతుల ఈ-వేలం

Ministry of Culture Starts E-auction of Around 1200 Mementos Gifts and Souvenirs of PM Modi, E-Auction Of Over 1200 Mementos, Ministry of Culture Starts E-auction , E-auction of 1200 Mementos Gifts of PM Modi, Mango News, Mango News Telugu, Mementos Gifts and Souvenirs of PM Modi, E-auction of Around 1200 Mementos Gifts and Souvenirs, E-auction Mementos Gifts and Souvenirs, PM Modi Gifts and Souvenirs, PM Narendra Modi Latest News And Updates, Ministry of Culture E-auction, PM Modi,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ జన్మదినం సందర్భంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయనకు చెందిన ప్రతిష్టాత్మకమైన మరియు చిరస్మరణీయ బహుమతుల ఈ-వేలం శనివారం ప్రారంభించబడింది. మొత్తం 16 రోజుల పాటు కొనసాగనున్న వేలం ప్రక్రియ అక్టోబర్ 2న ముగియనుంది. ఇక ఈ వస్తువుల ప్రదర్శన ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో నిర్వహించబడుతుంది. కాగా ఈ ప్రదర్శన అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. వేలం ద్వారా సేకరించిన నిధులను అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ‘నమామి గంగే’ కార్యక్రమానికి అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం గంగా నది పరిరక్షణ మరియు పునరుద్ధరణ చేపట్టిన సంగతి తెలిసిందే.

దీనిపై కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. వేలానికి రానున్న వస్తువులకు సంబంధించి వివరిస్తూ.. వేలంలో ఉన్న మెమెంటోల్లో సున్నితమైన పెయింటింగ్‌లు, శిల్పాలు, హస్తకళలు మరియు జానపద కళాఖండాలు ఉన్నాయి. వీటిలో అనేకం సంప్రదాయంగా అంగవస్త్రం, శాలువాలు వంటి బహుమతులుగా అందించబడతాయి. తలపాగాలు, ఉత్సవ ఖడ్గాలు. అయోధ్యలోని శ్రీరామ మందిరం మరియు వారణాసిలోని కాశీ-విశ్వనాథ దేవాలయం యొక్క ప్రతిరూపాలు మరియు నమూనాలు ఆసక్తిని కలిగించే ఇతర జ్ఞాపికలు ఉన్నాయని వెల్లడించారు. ఈ వేలం పాటను https://pmmementos.gov.in వెబ్ పోర్టల్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు.

ఇక దీనిపై నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత్ గడ్నాయక్ మరిన్ని వివరాలు అందించారు. ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో బహుమతిగా వచ్చిన మొత్తం 1200కు పైగా గిఫ్టులను, మెమెంటోలను, సావనీర్లను, ఇంకా ఇతర వస్తువులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ఇక బహుమతుల విలువ రూ.100 నుండి రూ.10 లక్షల వరకు ఉంటుందని ఆయన స్పష్ట చేశారు. కాగా ఇలా ప్రధాని వస్తువులను వేలం వేయడం ఇది నాలుగవసారి కావడం విశేషం. గతంలో తొలిసారిగా ఈ-వేలం 2019లో నిర్వహించబడగా, దీనిలో 1,805 బహుమతులు సాధారణ ప్రజలకు బిడ్డింగ్ కోసం అందుబాటులో ఉంచబడ్డాయి. రెండో రౌండ్‌లో 2,772 బహుమతి వస్తువులను వేలంలో ఉంచారు. ఇక సెప్టెంబర్ 2021లో జరిగిన మూడవ రౌండ్ వేలంలో 1,348 వస్తువులు ప్రదర్శించబడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =