దేశ రాజధానిలో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయం.. ప్రారంభించిన సీఎం కేసీఆర్

BRS Chief and CM KCR Inaugurated Party National Office at Vasant Vihar Delhi Today,BRS Chief and CM KCR Inaugurated Party National Office,Party National Office at Vasant Vihar Delhi,CM KCR Inaugurated Party National Office,BRS Chief Inaugurated Party National Office,Mango News,Mango News Telugu,Telangana CM KCR to inaugurate BRS central office,Telangana CM K Chandrasekhar Rao to open BRS office,KCR to inaugurate BRS central party office,Party National Office at Delhi,CM KCR Latest News And Updates,BRS Chief Latest News And Updates

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ జాతీయ శాశ్వత కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు యాగశాల, సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజలు వంటి తదితర క్రతువుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సహా పలువురు పార్టీలోని ముఖ్యులు దాదాపు 200 మంది హాజరయ్యారు. ఇక కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత సీఎం కేసీఆర్‌ పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు. కాగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ నేపథ్యంలో వసంత్‌విహార్‌ సమీప రోడ్లు, అశోక్‌ రోడ్డు, తెలంగాణ భవన్‌ పరిసరాల్లో కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఇక సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా.. ఆ రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా నిబంధనల ప్రకారం.. ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో స్థలాలను కేటాయించాలంటే ఆ పార్టీ కనీసం ఐదుగురు ఎంపీలను కలిగి ఉండాలి. ఐదుగురు ఎంపీలు ఉంటే 500 చదరపు గజాలు, అలాగే 15 మందికి పైగా ఎంపీలు ఉంటే ఆ పార్టీకి 1,000 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. ఈ క్రమంలో 16గురు ఎంపీలు ఉండటంతో బీఆర్‌ఎస్‌కు కేంద్రం రాజధానిలో పార్టీ కార్యాలయం కోసం 1,000 గజాల స్థలాన్ని అలాట్ చేసింది.

వసంత్‌ విహార్‌ లోని శాశ్వత నూతన బీఆర్‌ఎస్‌ భవన్‌ ప్రత్యేకతలు ఇవే..

  • మొత్తం 11 వేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం.
  • జి+3 తరహాలో నాలుగు అంతస్థులలో భవనం నిర్మాణం.
  • లోయర్‌ గ్రౌండ్‌లో మీడియా హాల్‌, సర్వెంట్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి.
  • గ్రౌండ్‌ ఫ్లోర్‌లో క్యాంటీన్‌, రిసెప్షన్‌ లాబీ సహా నాలుగు ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు ఉన్నాయి.
  • మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ చాంబర్‌ ఉంటుంది.
  • అలాగే అదే ఫ్లోర్‌లో మరికొన్ని ఇతర చాంబర్స్‌ మరియు కాన్ఫరెన్స్‌ హాల్స్‌ ఉన్నాయి.
  • ఇక 2వ అంతస్థులో 10, మరియు 3వ అంతస్థులో 10 చొప్పున మొత్తం 20 గదులు ఉన్నాయి.
  • వీటిలో పార్టీ ప్రెసిడెంట్‌ సూట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూట్‌ ఉన్నాయి.
  • మిగిలిన 18 రూములు పార్టీ ప్రతినిధులకు అందుబాటులో ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =