తెలంగాణలో డిసెంబర్ 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు పంపిణీ

CM KCR Announces That Farmers Will Get Yasangi Rythu Bandhu Money From Dec 27 to Jan 7th,CM KCR,Yasangi Rythu Bandhu Money,CM KCR New Announcement,Farmers,Rythu Bandhu Money,Yasangi Rythu Bandhu Money From Dec 27 to Jan 7th,CM KCR Announces That Farmers Will Get Rythu Bandhu Money From Dec 27 to Jan 7th,Rythu Bandhu Money,Rythu Bandhu Money From Dec 27 to Jan 7th,Mango News,Mango News Telugu,Rythu Bandhu 2020,Yasangi Rythu Bandhu Money 2020,Rythu Bandhu Latest News,Rythu Bandhu Scheme,KCR Review On Rythu Bandhu,KCR,Rythu Bandhu,CM KCR Latest News

రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని చెప్పారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని చెప్పారు.

యాసంగి సీజన్ రైతుబంధు సహాయం (రెండో విడత) పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =