ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా

APSLPRB Postponed The PET and PMT Events in Constable Recruitment Process,APSLPRB Postponed The PET and PMT Events,Constable Recruitment Process,PET and PMT Events Postponed,Mango News,Mango News Telugu,AP Police Constable PET and PMT postponed,AP Police Recruitment 2023,APSLPRB Police Recruitment 2023,APSLPRB Recruitment 2023, APSLPRB Notification,AP Police Notification,APSLPRB Latest News,AP PET Latest Updates,AP PMT Latest News,Andhra Pradesh Jobs,Latest Andhra Pradesh Government Jobs,Latest Andhra Pradesh Government Jobs Notification 2023

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. తన ఆ‎ధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ముఖ్యమైన శారీరక సామర్థ్య పరీక్షల్ని వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ మనీశ్ కుమార్ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌ (పీఎంటీ), ఫిజికల్ ఎలిజిబిలిటీ (పీఈటీ) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ పరీక్షలను ఎదుర్కొనేందుకు హాల్‌టికెట్స్ కూడా ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే తాజా నిర్ణయంతో ఫిజికల్ పరీక్షలు వాయిదా పడిన క్రమంలో.. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని, అభ్యర్థులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని మనీశ్ కుమార్ సిన్హా పేర్కొన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం గతేడాది నవంబర్‌లో రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షలను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించింది. అలాగే కానిస్టేబుల్ నియామక పరీక్షల కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 997 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,59,182మంది హాజరవగా.. వారిలో 95,208 మంది అర్హత సాధించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సుమారు 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి పీఈటీ, పీఎంటీ పరీక్షలకు హాజరయ్యేందుకు కాల్‌ లెటర్స్‌ కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే మార్చి 14నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్ధ్య పరీక్షల్ని నిర్వహించేందుకు బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే తాజా ప్రకటనతో పరీక్షలు వాయిదా పడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =