తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచార గడువు

2021 Telangana MLC Elections, Campaign for Telangana Graduates MLC Elections, Campaign for Telangana Graduates MLC Elections Ended, Graduate MLC Elections, Mango News, MLC Elections Campaign, Telangana Graduates MLC Elections Campaign, Telangana MLC Election Polling, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections Date, Telangana MLC Elections News

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన తమ అభ్యర్థుల తరపున టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు సమావేశాలు, ఆత్మీయ సదస్సులు నిర్వహించారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు కూడా కీలకంగా ప్రచారం నిర్వహించారు.

ముందుగా ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16 న నోటిఫికేషన్ విడుదల అయింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానంలో 71మంది, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మార్చి 14 వ తేదీన ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు:

  • టీఆర్‌ఎస్‌ – పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ – రాములు నాయక్
  • బీజేపీ – ప్రేమేందర్‌ రెడ్డి
  • తెలంగాణ జన సమితి – కోదండరాం

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు:

  • టీఆర్‌ఎస్‌ – సురభి వాణిదేవి
  • కాంగ్రెస్‌ – చిన్నారెడ్డి
  • బీజేపీ – రామచంద్రరావు
  • ఇండిపెండెంట్ – ప్రొఫెసర్ నాగేశ్వర్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 17 =