తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్‌కు సిఈసి సమాచారం ఇచ్చింది. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు వివరాలు అందజేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత టాంపర్ చేసారని అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టేసిందని తెలిపారు. అఫిడవిట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
2018 ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌ను.. తర్వాత మార్చారని రాఘవేంద్ర రాజు అనే అతను 2021 డిసెంబర్ 16న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన సిఈసి, అలాంటిదేమీ జరగలేదని తేలడంతో ఫిర్యాదు డిస్పోజ్ చేస్తున్నట్లు తెలిపింది. సిఈసి తెలిపిన దాని ప్రకారం.. శ్రీనివాస్‌గౌడ్ 2018 నవంబర్ 14న మూడు సెట్లు, నవంబర్ 19న మరో సెట్ నామినేషన్ వేశారు. అయితే 2018 నవంబర్ 14న శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఇతర అభ్యర్థులకు సంబంధించిన డూప్లికేట్ నామినేషన్లు, అఫిడవిట్లు కనిపించకుండా పోయాయి. వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానంలో ఈ అఫిడవిట్లు కనిపించకుండా పోయినందున.. దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేమని, అలాగే చర్యలు తీసుకోలేమని ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ