కోవిడ్ మహమ్మారిపై జరిగే రెండవ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ

PM Narendra Modi to Participate in Second Global COVID Virtual Summit Today, Narendra Modi to Participate in Second Global COVID Virtual Summit Today, PM Modi to Participate in Second Global COVID Virtual Summit Today, Second Global COVID Virtual Summit Today, Second Global COVID Virtual Summit, PM Narendra Modi will participate in the second Global Covid summit today, Second Global COVID Virtual Summit News, Second Global COVID Virtual Summit Latest News, Second Global COVID Virtual Summit Latest Updates, Second Global COVID Virtual Summit Live Updates, PM Narendra Modi, Narendra Modi, PM Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రెండవ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. కోవిడ్ మహమ్మారి విసురుతున్న నిరంతర సవాళ్లను పరిష్కరించడానికి మరియు బలమైన ప్రపంచ ఆరోగ్య భద్రతా నిర్మాణాన్ని నిర్మించడం కోసం కొత్త చర్యలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. “కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని నివారించడం మరియు సంసిద్ధతకు ప్రాధాన్యత ఇవ్వడం’ అనే అంశంపై ఈ సమ్మిట్ ప్రారంభ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సెషన్ మే 12, గురువారం సాయంత్రం 6:30 గంటల నుండి 7:45 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడనుంది.

ఈ సమ్మిట్ లో పలు ప్రపంచ దేశాల నేతలు పాల్గొననున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ మరియు ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారు. గతంలో సెప్టెంబర్ 11, 2021న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగిన మొదటి గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్‌లో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరోవైపు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సురక్షితమైన మరియు సరసమైన ధరలకే కోవిడ్ వ్యాక్సిన్‌లు, మందులు అందించడం, పరీక్షలు, చికిత్స చేయడానికి, జన్యుసంబంధమైన నిఘా కోసం తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడం మరియు హెల్త్ కేర్ వర్కర్స్ కోసం సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలతో కోవిడ్ పై పోరాటంలో భారత్ కీలక పాత్ర వహించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =