సీఎం జగన్ అధ్యక్షతన నేడే ఏపీ కొత్త కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?

AP CM YS Jagan will Chair Cabinet Meeting Today Likely to Take Key Decisions, AP CM YS Jagan will Chair Cabinet Meeting Today, AP CM YS Jagan Likely to Take Key Decisions, AP CM YS Jagan Mohan Reddy To Chair Cabinet Meeting Today, First Cabinet Meeting After Reshuffle, YS Jagan Mohan Reddy To Hold 1st Cabinet Meeting After Reshuffle On May 13, Andhra Pradesh New Cabinet Will Meet on May 13th, Andhra Pradesh CM Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, CM Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, AP CM YS Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, YS Jagan Mohan Reddy to hold first Cabinet meeting on May 13, AP CM to hold first Cabinet meeting on May 13, first Cabinet meeting on May 13, AP CM to hold first Cabinet meeting, AP New Cabinet Will Meet on May 13th, Andhra Pradesh New Cabinet, AP New Cabinet, AP New Cabinet News, AP New Cabinet Latest News, AP New Cabinet Latest Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నేడు (మే 12, గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలో సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రులతో గత నెలలో నూతన కేబినెట్ కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కేబినెట్ ఏర్పడిన తర్వాత ఏపీ కేబినెట్‌ నేడు తొలిసారిగా భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముందుగానే ఆదేశాలు ఇచ్చారు.

ఈ‌ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మరియు చేపట్టబోయే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. అసని తుఫాన్ నష్టం, అమ్మ ఒడి పథకం, తాజాగా చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, దిశా చట్టంలో సవరణలు, దేవాదాయశాఖలో భూముల ఆక్రమణల అంశం, మూడు రాజధానుల బిల్లు సహా పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 11 =