రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం, వరద నష్టంపై పరిశీలన

Central Team To Assess Loss due to Heavy Rains, Central Team will Arrive to Hyderabad, Central Team will Arrive to Hyderabad Tomorrow, Heavy Rainfall In Hyderabad, Heavy Rains in Hyd, Heavy Rains In Hyderabad, Hyderabad Rains, Hyderabad Rains news, Rains In Hyderabad, telangana, Telangana rains, telangana rains news, telangana rains updates

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో సహా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురియడంతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వ‌ర‌దల వలన ఏర్పడ్డ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు గురువారం నాడు హైదరాబాద్ న‌గ‌రానికి కేంద్ర బృందం రానుంది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటుగా హైద‌రాబాద్ ‌తో పాటుగా జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నష్టాన్ని పరిశీలించి అంచనా వేయ‌నున్నారు. ఈ కేంద్ర బృందంలో వ్యవసాయ, రహదారులశాఖ అధికారులు, తదితరులు ఉండనున్నారు.

మరోవైపు భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లేఖ కూడా రాశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − ten =