ఏపీలో ఇంటర్ ప్రవేశాలు ఆన్‌లైన్ లోనే, దరఖాస్తు పక్రియ మొదలు

Andhra Pradesh Intermediate admissions, Andhra Pradesh Intermediate admissions to be online, AP Inter Admission 2020, AP Inter Board, AP Inter Board Decides to Conduct Intermediate Admissions, AP Inter Board Decides to Conduct Intermediate Admissions Process, AP Inter Online Admission 2020-21, AP Intermediate Admission 2020, Intermediate Admissions Process in Online

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇంటర్మీయట్ ప్రవేశాలను ఆన్‌లైన్ విధానం ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేస్తూ, ఈ సంవత్సరం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 29 వరకు https ://bie.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఇంటర్మీయట్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ రెగ్యులర్ కోర్సులతో పాటుగా ఒకేషనల్ కోర్సులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 100 ఫీజు చెల్లించాలని చెప్పారు. ఇంటర్ ప్రవేశాల విషయంలో విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్‌ చేయొచ్చని ఇంటర్‌ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here