సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం

CM KCR Announces Relief Package Of Rs 10000 Per Acre To Farmers Who Loss Paddy Crops Due To Heavy Rains In Telangana,CM KCR Announces Relief Package,Rs 10000 Per Acre To Farmers,Relief Package For Who Loss Paddy Crops,Relief Package Due To Heavy Rains In Telangana,Mango News,Mango News Telugu,KCR Announces Rs 10000 Per Acre,Telangana Govt Not To Send Crop Loss Report,KCR Visits 4 Districts Today,CM KCR News And Live Updates,BRS Party, Telangana Latest News And Updates

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతల, గార్లపాడు తదితర గ్రామాల్లో నేలకొరిగిన పంటలను పరిశీలించారు. పంట నష్టంపై ఆయా ప్రాంతాల రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఖమ్మం పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వడగళ్ల వానతో రాష్ట్రవ్యాప్తంగా పంటనష్టం జరిగిందని, తెలంగాణలో దాదాపు 2,22,250 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని భరోసానిచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పిన సీఎం కేసీఆర్, వెంటనే ఈ సాయాన్ని రైతులకు అందజేస్తామని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇలాంటి సమయంలో రైతులకు ఇచ్చే దాన్ని నష్టపరిహారం అనరని, దీనిని సహాయ పునరావాస చర్యలు అని అంటారని వివరించారు. ఇక రాష్ట్రంలోని సమస్యలపై కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదని, కేంద్రానికి చెప్పినా, గోడకు చెప్పినా ఒకటేనని మండిపడ్డారు. దేశంలో రైతులకు లాభం చేకూర్చే పాలసీలు లేవని అభిప్రాయపడిన సీఎం కేసీఆర్.. దేశానికి ఒక కొత్త వ్యవసాయ పాలసీ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 4 =