రాజస్థాన్, ఒడిశా, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

BJP Appointed New State Presidents For Rajasthan Odisha Delhi And Bihar,BJP Appointed New State Presidents,New State Presidents For Rajasthan,New State Presidents For Odisha And Delhi,BJP Appointed Bihar New State President,Mango News,Mango News Telugu,BJP Appoints New State Chiefs For Delhi,BJP Appoints New State Unit Chiefs For Rajasthan,BJP Appoints 4 New State Unit Presidents,BJP Party,Latest Indian Political News,Indian Politics,Indian Political News Live Updates

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశా, బీహార్ వంటి నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌ రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్థానంలో సీపీ జోషి నియమితులయ్యారు. ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి మన్మోహన్ సమాల్, ఢిల్లీలో వీరేంద్ర సచ్‌దేవాను, బీహార్‌ రాష్ట్రంలో సామ్రాట్ చౌదరిని నూతన పార్టీ అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. నాలుగు రాష్ట్రాలకు పార్టీ కొత్త అధ్యక్షుల నియామకంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ గురువారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here