షహీద్ దివస్: భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

PM Modi Paid Tributes To Bhagat Singh Sukhdev And Rajguru On The Occasion Of The Shaheed Diwas Today,PM Modi Paid Tributes To Bhagat Singh,PM Modi On The Occasion Of The Shaheed Diwas,Shaheed Diwas Today,Tributes To Sukhdev And Rajguru,Mango News,Mango News Telugu,PM Modi HM Amit Shah Pay Tribute To Freedom Fighters,Shaheed Diwas 2023,PM Modi Pays Tributes To Freedom Fighters,Indian Prime Minister Narendra Modi,Narendra Modi Latest News And Updates,Leaders Pay Tributes On Shaheed Diwas

షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్‌గురులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురుల త్యాగాలను భారతదేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. వీరు మన స్వాతంత్య్ర పోరాటానికి అసమానమైన కృషి చేసిన మహానుభావులు” అని పేర్కొన్నారు. భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లకు నివాళులు అర్పించేందుకు, గౌరవించుకునేందుకు ప్రతి ఏడాది మార్చి 23ని ‘షహీద్ దివస్‌’గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

1928 డిసెంబర్ లో సీనియర్ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా లాహోర్‌లో బ్రిటీష్ అధికారి జేమ్స్ స్కాట్ హత్యకు భగత్ సింగ్, సుఖ్‌దేవ్ మరియు రాజ్‌గురు పథకం వేశారు. అయితే వారు పొరపాటున మరో పోలీసు సూపరింటెండెంట్ జాన్ పి సాండర్స్‌ను గుర్తించి, అతనిని చంపారు. అలాగే లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై దాడి చేయాలని మరియు ప్రజా భద్రతా బిల్లు మరియు వాణిజ్య వివాద చట్టాన్ని ఆమోదించకుండా నిరోధించాలని భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్ ప్రణాళిక రూపొందించారు. 1929, ఏప్రిల్ 8న వారు ముగ్గురూ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడికి ప్రయత్నించారు, కానీ పట్టుబడ్డారు. ఈ కేసుల్లో ముగ్గురికి మరణశిక్ష విధించబడింది. దీంతో 1931, మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులను ఉరితీశారు. ఉరితీసినప్పుడు భగత్ సింగ్ మరియు సుఖ్‌దేవ్‌కు 23 సంవత్సరాలు కాగా, రాజ్‌గురు వయస్సు 22 కావడం గమనార్హం. వీరి ప్రాణ త్యాగాలు భారతదేశ స్వాత్రంత్య్ర పోరాటంలో కీలక మలుపుగా మారి, లక్షలాది మంది యువత స్వాత్రంత్య్ర పోరాటం వైపు అడుగులు వేసేలా చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here