దసరా నాడు ధరణి పోర్టల్ ప్రారంభం, అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్లు : సీఎం కేసీఆర్

CM KCR, dharani portal agriculture, dharani portal in agriculture, Dharani Portal Launch On Dussehra Festival, dharani portal news, dharani portal registration, dharani portal start date, dharani portal telangana, Dharani portal to be launched on Dasara, Telangana CM KCR, Telangana CM to launch Dharani portal on Dussera

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఈ దసరా పండుగ రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున సీఎం కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ను ఆరోజు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని చెప్పారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలపై, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. డెమో ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ప్రతి మండలానికి ఒకరు చొప్పున, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ల నియోమకాన్ని పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అన్నారు. తహశీల్దారు కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో డాక్యుమెంట్ రైటర్స్ కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటా ధరణి పోర్టల్ లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. ఆ తర్వాత జరిగే మార్పులు చేర్పులు వెంటవెంటనే నమోదు చేయడం జరుగుతుందని సీఎం అన్నారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =