నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Declared that He will Fight for Integrated Development of Dalits, CM KCR Declared that He will Fight for Integrated Development of Dalits till his Last Breath, CM KCR held Review Meeting over Dalit Bandhu Scheme at Karimnagar Collectorate, Dalit Bandhu scheme, Dalit Bandhu Scheme at Karimnagar Collectorate, Dalit Bandhu Scheme In Telangana, Dalit Bandhu Scheme News, Dalit Bandhu Scheme Pilot Project, Dalit Bandhu Scheme Updates, Integrated Development of Dalits, Karimnagar, Karimnagar Collectorate, KCR Declared that He will Fight for Integrated Development of Dalits, KCR to review Dalit Bandhu, Mango News, Telangana CM KCR, Will fight for development of Dalits

దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమని, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు.

పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నాం, అంతే పట్టుదలతో దళితుల సమగ్రాభివృద్ధి సాధిస్తాం:

పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పట్టుపడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం అన్నారు. “ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం. సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. కరెంటును నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ఆకలి చావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది రాష్ట్రం. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా నిలబడింది ప్రభుత్వం. అన్ని రంగాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను స్ఫూర్తిని అందిస్తున్నది” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

“రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించినం. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసిఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాము. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నాం. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృద్ధి కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్ధిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన దళితబంధు గత సంవత్సరమే ప్రారంభమయ్యేది, కానీ కరోనా కారణంచేత ఆలస్యమైంది” అని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీంద్రసింగ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నేతలు మేడి మహేష్, కంసాల శ్రీనివాస్, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్, గోసుకంటి అరుణ్, నల్లా కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − nine =