తెలంగాణ రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్స‌వాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌, అధికారులకు కీలక ఆదేశాలు

CM KCR Holds Review Meet on Telangana Formation Day Celebrations in New Secretariat,CM KCR Holds Review Meet,Review Meet on Telangana Formation Day,Telangana Formation Day Celebrations,Telangana Formation Day in New Secretariat,Mango News,Mango News Telugu,Telangana Formation Day Latest News,Telangana Formation Day Latest Updates,Telangana Formation Day,Telangana Formation Day Live News,CM KCR Latest News,CM KCR Latest Updates

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. శనివారం నూతనంగా నిర్మించిన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ స‌చివాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి రాష్ట్ర మంత్రులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి సహా పలువురు సంబంధిత శాఖల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయా శాఖ‌లు సమర్పించిన కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ అధికారుల‌తో చ‌ర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉత్స‌వాల‌ నిర్వహణకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్‌ 2న ప్రారంభమవనున్న ఈ వేడుకలు 21 రోజులపాటు కొనసాగనున్నాయి. దీంతో ఉత్సవాల ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఇప్పటికే ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీశ్‌ రావు అధ్య‌క్ష‌త‌న‌ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం దృష్టికి తెచ్చారు. వాటిలో కొన్నింటికి సీఎం కేసీఆర్ మార్పులు సూచించారు. ఈ 21 రోజులపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఒక్కో రోజు ఒక్కో రంగానికి సంబంధించి ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామగ్రామాన రాష్ట్రావ‌త‌ర‌ణ దశాబ్ది ఉత్స‌వాల‌ను ఘనంగా నిర్వహించాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =