హైదరాబాద్‌లోని కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

CM KCR Lays Foundation Stone For Hare Krishna Heritage Tower In Kokapet Hyderabad,CM KCR Lays Foundation Stone For Hare Krishna Heritage Tower,Hare Krishna Heritage Tower In Kokapet,Hare Krishna Heritage Tower,Mango News,Mango News Telugu,KCR performs Bhumi Puja to Hare krishna heritage tower,Bhumi puja for Hare Krishna Heritage Tower,Hare Krishna Heritage Tower Latest News,Hare Krishna Heritage Tower Latest Updates,Bhumi Puja Ceremony For Hare Krishna Heritage Tower,CM KCR Latest News And Updates,Kokapet Hyderabad Latest News And Updates

ప్రపంచవ్యాప్తంగా మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు మాత్రం ఒక్కడేనని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. సోమవారం ఆయన హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో “హరేకృష్ణ హెరిటేజ్ టవర్”కి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. హైదరాబాద్‌ నగరంలో హరేకృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామని, ఇంతటి మహోన్నత కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు చాలా సంతోషమని పేర్కొన్నారు. ఆలయం అనేది ఒక సామాజిక సాంత్వన కేంద్రమని అభివర్ణించిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం తరపున ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తామని ప్రకటించారు.

యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని, అలాగే వేములవాడ, కొండగట్టు ఆలయాలను కూడా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ఇక హరేకృష్ణ ఫౌండేషన్‌, ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అక్షయపాత్ర ద్వారా నిత్యం లక్షలమందికి అన్నదానం చేస్తోందని వెల్లడించారు. ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలోని దాదాపు 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు కేవలం రూ.5కే భోజనం అందిస్తోందని, దేశవ్యాప్తంగా ఎన్నో పాఠశాలల్లో పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తోందని వివరించారు. అలాగే కరోనా సమయంలో కూడా హరేకృష్ణ ఫౌండేషన్‌ సేవలు అందించిందని, ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలిచిందని, ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయని కొనియాడారు.

కాగా కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఇక్కడ దాదాపు 6 ఎకరాల స్థలంలో రూ. 200 కోట్లు అంచనా వ్యయంతో హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాంగణంలో శ్రీ కృష్ణ మందిరంతో పాటు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉండనుంది. ఇక్కడ ప్రత్యేకంగా రాధా కృష్ణుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మందిరంలో ఒకేసారి 1500 మంది భక్తులు ఉండేందుకు వీలు ఉంటుంది. అలాగే తిరుమలలోని ఆలయం మాదిరే ఇక్కడ కూడా రాతితో నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవాలయం 37,000 చ.అ.ల ప్రాకారాన్ని కలిగి ఉంటుంది. ఒకేసారి 500 మంది భక్తులు కూర్చునేలా అన్నదానం హాలును నిర్మింస్తున్నారు. దీనితో పాటుగా ఇంకా లైబ్రరీ, కల్యాణి ఆడిటోరియం, కల్యాణ మండపం, ఓపెన్ ఎయిర్ థియేటర్, లెక్చర్ హాల్స్, క్యూ కాంప్లెక్స్, గెస్ట్ హౌస్ (100 గదులు), ఆశ్రమం వంటి ఇతర సౌకర్యాలతో కూడిన నిర్మాణాలను కూడా పెద్దఎత్తున ఏర్పాటు చేస్తుండటం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here