సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణ మీడియా అకాడెమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ కొనసాగింపుకు ఆదేశాలు

CM KCR Orders CS Somesh Kumar To Continue Allam Narayana as Telangana Media Academy Chairman, Telangana CM KCR Orders CS Somesh Kumar To Continue Allam Narayana as Telangana Media Academy Chairman, KCR Orders CS Somesh Kumar To Continue Allam Narayana as Telangana Media Academy Chairman, CS Somesh Kumar To Continue Allam Narayana as Telangana Media Academy Chairman, Allam Narayana as Telangana Media Academy Chairman, Telangana Media Academy Chairman Allam Narayana, Allam Narayana, Telangana Media Academy Chairman, Telangana CS Somesh Kumar, CS Somesh Kumar, Allam Narayana News, Allam Narayana Latest News, Allam Narayana Latest Updates, Allam Narayana Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు సంవత్సరాల పాటు తెలంగాణ మీడియా అకాడెమీకి ఛైర్మన్‌గా అల్లం నారాయణను కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. కాగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ మలి ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, చేసిన గొప్ప సేవలకు గుర్తింపుగా సీఎం కేసీఆర్ 2014 జూలైలో నారాయణను తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీకి మొదటి చైర్మన్‌గా నామినేట్ చేశారు.

శ్రీ అల్లం నారాయణ డిసెంబర్ 13, 1958న కరీంనగర్ జిల్లా మంథని మండలం గాజులపల్లి గ్రామంలో జన్మించారు. ‘జీవగడ్డ’ అనే తెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నారాయణ, జర్నలిస్టుగా తన మూడు దశాబ్దాల కాలంలో.. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రజాతంత్ర వంటి ప్రముఖ తెలుగు వార్తా పత్రికలలో బెంగళూరు, విజయవాడ మరియు హైదరాబాద్‌లలో వివిధ హోదాలలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్‌ను స్థాపించి 13 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి ఫోరం వ్యవస్థాపక కన్వీనర్‌గా ఉన్నారు. ఇంకా ఫోరమ్ ఫర్ సోషల్ చేంజ్ వ్యవస్థాపక సభ్యుడు మరియు ఫోరమ్ అధ్యక్షుడిగా కూడా నారాయణ ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here