తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. విజయం సాధించిన బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి

Telangana MLC Election Result 2023 AVN Reddy Who Supports by BJP Win by 1150 Votes,Telangana MLC Elections,Telangana MLC Election Result 2023,AVN Reddy Who Supports by BJP,AVN Reddy Win by 1150 Votes,Mango News,Mango News Telugu,BJPs Supported Candidate AVN Reddy Won,Telangana MLC Election Result Highlights,Teacher MLC Results,AVN Reddy,Teacher MLC,AVN Reddy Won with 1150 Votes,Telangna BJP Party,Telangana BJP Chief Bandi Sanjay,MLC Teacher Quota Elections,MLC Teacher Quota Elections Results,MLC Election Results 2023,MLC Elections 2023,Telangana MLC Elections Latest Updates,Telangana MLC Elections Live News,AVN Reddy Latest Updates

తీవ్ర ఉత్కంఠగా సాగిన తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ తొలి రౌండ్ నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆయన గురువారం అర్ధరాత్రి దాటాక వెలువడిన ఫలితాల్లో ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై 1,150 ఓట్ల తేడాతో గెలుపు పొందారు. ఇక కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి నాలుగో రౌండ్‌లోనే నిష్క్రమించారు. సాధారణంగా ఒక అభ్యర్థి గెలవాలంటే మొదటి ప్రాధాన్యతా ఓట్లలో 50 శాతానికి పైగా సాధించాల్సి ఉంటుంది. అయితే ఏ అభ్యర్థి కూడా తగిన సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించలేకపోయారు. దీంతో మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం సాధించినట్లయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =