తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (డిసెంబర్ 4, ఆదివారం) మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదే విధంగా పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మరియు మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
ఇక మహబూబ్ నగర్ లో బస్టాండ్ సమీపంలో నిర్మించిన నూతన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నూతన కలెక్టరేట్ వద్ద చేసిన ఏర్పాట్లను, అలాగే బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం జిల్లా నేత, రాష్ట్ర పర్యాటక, క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE