ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరించిన నిర్మల్ పోలీసులు.. హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్

Telangana BJP Chief Bandi Sanjay Files Petition in High Court After Permission Rejected For His Padayatra by Nirmal Police,Bandi Sanjay's 5th Praja Sangrama Yatra,Praja Sangrama Yatra from 28th,Bhainsa to Karimnagar,Mango News,Mango News Telugu,Praja Sangrama Yatra,BJP Telangana Chief Bandi Sanjay,BJP Chief Bandi Sanjay,Bandi Sanjay,Bandi Sanjay Kumar,Praja Sangrama Yatra Latest News and Updates,Praja Sangrama Yatra News And Live Updates, Telangana BJP,BJP Party

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు నిర్మల్ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ పాదయాత్రతో పాటు భైంసా పట్టణంలో జరిగే బహిరంగ సభకు అనుమతి లేదని ఆదివారం స్పష్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర జరిపి తీరుతానని ప్రకటించిన బండి సంజయ్ భైంసాకు బయలుదేరగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను కరీంనగర్ లోని స్వగృహంలో గృహనిర్బంధంలో ఉంచారు. ఇంటినుంచి సంజయ్ బయటకు అడుగు పెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు భైంసాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట సభకు అన్ని అనుమతులు ఇచ్చాక ఇప్పుడు చివరి నిమిషంలో ఎందుకు ఆపుతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ బండి సంజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈరోజు మధ్యాహ్నం లోపు కోర్టు దీనిపై తీర్పు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ కోర్టు అనుమతి నిరాకరిస్తే తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు హౌస్‌అరెస్ట్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 3 =