తెలంగాణ అంధకారంలో ఉంది, వెలుగులు నింపేందుకే బండి సంజయ్ పాదయాత్ర – బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Telangana National BJP President JP Nadda Addresses in Public Meeting at Hanumakonda Today, Telangana BJP National President JP Nadda To Address Public Meeting In Warangal, BJP National President JP Nadda To Address Public Meeting In Warangal, JP Nadda Attends Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Concluding Meeting, Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Concluding Meeting, 3rd Phase Of Praja Sangrama Yatra Concluding Meeting, Praja Sangrama Yatra 3rd Phase, Bandi Sanjay Kumar, BJP National President JP Nadda, BJP Chief JP Nadda, BJP National President, Warangal Public Meeting News, Warangal Public Meeting Latest News And Updates, Warangal Public Meeting Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ అంధకారంలో ఉందని, వెలుగులు నింపేందుకే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర తలపెట్టారని తెలిపారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మేరకు ఆయన శనివారం బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు.

జేపీ నడ్డా ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • తెలంగాణ అంధకారంలో ఉంది, వెలుగులు నింపేందుకే బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టారు.
  • అయితే తెలంగాణలో పాదయాత్ర చేయకుండా బండి సంజయ్‌ను అడ్డుకోవాలని చూశారు.
  • వరంగల్‌లో సభకు ఒక్క రోజు ముందు అనుమతి రద్దు చేయించారు, అయినా వెనక్కి తగ్గకుండా హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతి పొందాం.
  • రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది, అందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భయపడుతోంది.
  • త్వరలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపుతారు.
  • తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దుర్వినియోగం చేస్తోంది.
  • కేంద్రం తెలంగాణకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రూ. 3,500 కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం వాటిలో కేవలం రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
  • మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని వరంగల్ జైలుని కూల్చివేశారు. ఇప్పటివరకు ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించలేదు.
  • టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదు కానీ అవినీతి మాత్రం బాగా జరిగింది.
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో తప్పక అధికారంలోకి వస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =