ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై డిసెంబర్ 10 వరకు స్టే పొడిగింపు

High Court Extends Stay Up to Dec 10 on Non-Agricultural Lands Registration in Dharani Portal,High Court,Telangana Government Tells High Court,Telangana Government,Telangana High Court,High Court Extends Stay Up to Dec 10,Dharani Portal,Mango News,Mango News Telugu,Telangana High Court Decision On Dharani Portal,Telangana High Court Decision On Dharani Portal,Dharani Portal,Dharani Portal Telangana,Telangana News,Telangana,Telangana Latest News,Telangana High Court,Telangana Dharani Portal,Dharani Website Telangana,Dharani Portal Registrations,Dharani Portal Telugu,Dharani Portal Launch,Cm KCR On Dharani Portal,TS Dharani Portal,Dharani Portal Registration Process,Telangana Registrations Start

రాష్ట్రంలో ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 10 వరకు పొడిగించింది. ధరణి నిబంధనలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్‌ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేసేందుకు అడ్వొకేట్ జనరల్ సమయం కోరడంతో విచారణను 10వ తేదీకి వాయిదా వేస్తూ, స్టేను అప్పటివరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మరోవైపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరియు మ్యుటేషన్లు పూర్తిగా ఆగిపోయిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని అడ్వొకేట్ జనరల్ హైకోర్టును కోరారు. అనంతరం కోర్టు స్పందిస్తూ రిజిస్ట్రేషన్లు ఆపాలని తాము ఆదేశించలేదని, పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవచ్చని సూచించింది. అయితే ఆ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసే షరతు విధించి పాత విధానంలో రిజిస్ట్రేషన్లు జరపవచ్చని హైకోర్టు పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − nine =