జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైస్సార్సీపీ ప్రకటన

GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Mango News Telugu, telangana, Telangana Municipal Elections, YSR Congress Party, YSR Congress Party Decided to Not Contest in GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోరుకు టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం, జనసేన, తెలంగాణ జన సమితి పార్టీలు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల్లో ఒకటైన వైస్సార్సీపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికలలో వైస్సార్సీపీ పోటీ చేయటం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.గట్టు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గమనించాలని ఆయన కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seventeen =