ఇంటి నుండి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించండి – సీపీ అంజనీ కుమార్

Anjani Kumar Appeals People to Wear Mask Mandatorily, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, CP Anjani Kumar, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus News, Telangana CP Anjani Kumar, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మాస్కు ధరించడం కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మరోసారి పిలుపునిచ్చారు.

“కరోనా వైరస్‌తో పోరాడటం హైదరాబాద్‌లోని ప్రతి పౌరుడి బాధ్యత. మనం కరోనా మహమ్మారి యొక్క కీలకమైన దశలో ఉన్నాం. మీరు మీ ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు మాస్క్ ధరించండి” అని సీపీ అంజనీ కుమార్ సూచించారు. ఫేస్ మాస్క్ లేకుండా నగరంలోని బహిరంగ ప్రదేశాలలో తిరిగే వారిపై జూలై 29, బుధవారం ఒక్కరోజే 2275 కేసులను బుక్ చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + sixteen =