ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

andhra pradesh, Andhra Pradesh MLC By Elections, Andhra Pradesh MLC Elections, AP MLC By Elections 2020, AP MLC By-elections, AP NEWS, AP Political News, MLC By-elections

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక కావడంతో, తమ మంత్రి పదవులతో పాటుగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు జూలై 30, గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్‌ ను విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా జరిగే ఏర్పాట్లన్నీ కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ఒక సీనియ అధికారిని నియమించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉపఎన్నిక షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – ఆగస్టు 6
  • నామినేషన్లకు ఆఖరితేదీ – ఆగస్టు 13
  • నామినేషన్ల పరిశీలన – ఆగస్టు14
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఆగస్టు 17
  • ఎన్నిక జరిగే తేదీ – ఆగస్టు 24
  • పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – ఆగస్టు 24 సాయంత్రం 05:00 కు
  • ఎన్నికల ముగింపు తేదీ – ఆగస్టు 26

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =