ఇంప్లోజన్‌ విధానంలో సచివాలయ భవనాల కూల్చివేత?

Demolition of Telangana Secretariat, Demolition of Telangana Secretariat Buildings, Demolition of Telangana Secretariat Buildings Under The Implosion Method, Demolition of Telangana Secretariat Under The Implosion Method, Mango News Telugu, Telangana Latest News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమవడంతో పాత భవనాల కూల్చివేతపై కసరత్తు మొదలుపెట్టింది. పాత భవనాలను సాంప్రదాయ పద్ధతిలో కూల్చివేయడానికి చాల సమయం పడుతుంది కావున, వేగంగా భవనాలు కూల్చివేసే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. కూల్చివేతకు ఇంప్లోజన్‌ విధానాన్ని అమలు చేయాలనీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఇంప్లోజన్‌ విధానం వలన చుట్టుపక్కల ఉండే కట్టడాలకు ఎటువంటి ప్రమాదం ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అతి తక్కువ సమయంలో కూల్చివేసే ఇంప్లోజన్‌ విధానాన్ని అనుసరించి, కొత్త భవనాల నిర్మాణ పక్రియ త్వరితగతిన మొదలుపెట్టాలని ప్రభుత్వం చూస్తుంది.

పెద్ద పెద్ద భవనాల కూల్చివేతకు ఎప్పటినుంచో ఎక్స్‌ప్లోజన్‌ విధానాన్ని పాటిస్తున్నారు, అయితే ప్రస్తుతం తెలంగాణ సచివాలయం ఉన్న ప్రాంతంలో ఈ పద్ధతి వలన పేలుడు శకలాలు దూరంగా పడే అవకాశం ఉండడం వలన ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఇక ఇంప్లోజన్‌ పద్ధతిలో బిల్డింగ్ స్తంభాలకు జిలెటిన్ స్టిక్స్ అమర్చడంతో 15 సెకండ్లలోపే భవనం కుప్పకూలిపోతుంది. ఎటువంటి శకలాలు దూరంగా పడే అవకాశం ఉండదు, కానీ దుమ్ము, ధూళి మాత్రం ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇంప్లోజన్‌ పద్ధతిలో కూల్చివేత ఎలా జరుగుతుందో ముందే త్రీడి చిత్రీకరణ ద్వారా నమూనా తయారుచేసి చూపిస్తారు. సచివాలయంలో అన్ని బ్లాకుల కూల్చివేతకు ఈ విధానం ద్వారా రూ.10 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసారు.

 

[subscribe]
[youtube_video videoid=7ntMLMXZW40]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here