అమెజాన్ అడవుల్లో ఆగని మంటలు

#PrayForTheAmazon #PrayForAmazonia., #SaveAmazon, Amazon Rainforest, Amazon Rainforest At A Record Rate, Amazon Rainforest Continues Burning, Amazon Rainforest Continues Burning Rapidly, Brazilian Government’s land policies, Fires in Amazon rainforest at a record rate, international news, international news 2019, International News Updates, Latest International news, Mango News Telugu, National Institute for Space Research, Today’s International News

బ్రెజిల్, పెరూ, కొలంబియా దేశాల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలో అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొద్దిరోజులుగా మంటలు చెలరేగి తీవ్ర స్థాయిలో దగ్దమవుతుంది. లంగ్స్ అఫ్ అవర్ ప్లానెట్ అని చెప్పుకునే ఈ అమెజాన్ రైయిన్ ఫారెస్ట్ మంటలకు ఆహుతి అవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భూమి మీద మానవాళికి అవసరమైన ఆక్సిజన్ లో 20 శాతం ఈ అడవుల నుంచే అందుతుంది. అమెజాన్ రైయిన్ ఫారెస్ట్ 2.1 మిలియన్ చదరపు మైళ్ళలో విస్తరించి ఉంది. ప్రపంచాన్ని గ్లోబల్ వార్మింగ్ భారీ నుంచి కాపాడడంలో ఈ అడవులే కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అధిక ఉష్ణోగ్రతలవలన, ఆర్ద్రత శాతం తగ్గిపోవడం వలన సాధారణంగా అక్కడ మంటలు చెలరేగుతూనే ఉంటాయి, అయితే ఈసారి తీవ్రస్థాయిలో ఏర్పడిన మంటలను శాటిలైట్ ద్వారా నాసా గుర్తించి ఫోటోలను విడుదల చేసింది. గడిచిన వారం రోజుల్లోనే అనేక ప్రాంతాలకు మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. చుట్టుపక్కల ఉండే నగరాల్లో పొగ వ్యాపిస్తుండడంతో తీవ్రత ప్రపంచం దృష్టికి వచ్చింది. అమెజాన్ రైయిన్ ఫారెస్ట్ లో ఈ సంవత్సరం అత్యధికంగా అగ్ని ప్రమాదాలు జరిగినట్టు బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్ అడవులు తగలబడిపోవడం పట్ల ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆందోళన వ్యక్తం చేసారు. జి-7 సభ్య దేశాలు ఈ విషయంపై అత్యవసరంగా స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెజాన్ అడవులు దగ్దమవుతుండడంతో సినీ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=8yfvaH0dZGY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =