ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లో పరిస్థితులపై దర్శకుడు రాజమౌళి అసహనం

Delhi Airport, Delhi Airport on Twitter, Director SS Rajamouli, Director SS Rajamouli Tweets, Director SS Rajamouli Tweets over Facilities at Delhi Airport, lack of facilities at Delhi airport, Mango News, Not a good first impression of India, rajamouli ss on Twitter, RRR director SS Rajamouli, SS Rajamouli, SS Rajamouli complains about lack of amenities at Delhi Airport, SS Rajamouli Tweets over Facilities at Delhi Airport

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌ లో వసతులపై శుక్రవారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ చేశారు. “లుఫ్తానాసా విమానంలో అర్ధరాత్రి 1 గంటకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష కోసం నింపడానికి ఫారాలు ఇవ్వబడ్డాయి. ప్రయాణీకులందరూ ఆ ఫారాలను నింపడానికి నేలపై కూర్చుని లేదా గోడలకు ఆనుకుని ఉన్నారు. ఆ దృశ్యం చూడడానికి ఏమీ బాలేదు. ఇందుకోసం టేబుల్స్ ఏర్పాటు చేయడం ఒక సాధారణ సేవ. అలాగే ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటివి చూస్తే విదేశీయులకు భారతదేశంపై మొదటగా గొప్ప భావన కలిగించవు. దయచేసి ఈ అంశాలను పరిశీలించండి. ధన్యవాదాలు” అంటూ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ రాజమౌళి ట్వీట్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here