తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్ 2020-21’ షెడ్యూల్ విడుదల

Degree Online Services, Degree Online Services Telangana, DOST, DOST Convenor, DOST portal, new degree college admission, new degree college admission notification, online degree admission system, Telangana Degree College Admissions, Telangana Education Department, Telangana State Council for Higher Education, TSCHE

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి గానూ దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సోమవారం నాడు విడుదల చేసింది. జూలై 1 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి ప్రకటించారు.

దోస్త్ 2020-21 అడ్మిషన్ షెడ్యూల్ :

  • నోటిఫికేషన్ విడుదల: జూన్ 22
  • ఫేజ్-1 దోస్త్ రిజిస్ట్రేషన్లు : జూలై 1 నుంచి 14 వరకు
  • వెబ్ ఆప్షన్ల నమోదు – జూలై 6 నుంచి 15 వరకు
  • స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – జూలై 13, 14
  • ఫేజ్-1 డిగ్రీ సీట్ల కేటాయింపు – జూలై 22
  • ఫేజ్ -1 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – జూలై 23 నుంచి 27 వరకు
  • ఫేజ్ -2 దోస్త్ రిజిస్ట్రేషన్లు – జూలై 23 నుంచి 29 వరకు
  • ఫేజ్ -2 వెబ్ ఆప్షన్ల నమోదు – జూలై 23 నుంచి 30 వరకు
  • ఫేజ్-2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – జూలై 29
  • ఫేజ్-2 డిగ్రీ సీట్ల కేటాయింపు – ఆగస్టు 7
  • ఫేజ్-2 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – ఆగస్టు 8 నుంచి 12 వరకు
  • ఫేజ్-3 దోస్త్ రిజిస్ట్రేషన్లు : ఆగస్టు 8 నుంచి 13 వరకు
  • ఫేజ్-3 వెబ్ ఆప్షన్ల నమోదు – ఆగస్టు 8 నుంచి 14 వరకు
  • ఫేజ్-3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ – ఆగస్టు 13
  • ఫేజ్-3 డిగ్రీ సీట్ల కేటాయింపు – ఆగస్టు 19
  • ఫేజ్-3 విద్యార్థులకు ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ – ఆగస్టు 20 నుంచి 21 వరకు
  • కాలేజీలో రిపోర్టింగ్ – ఆగస్టు 24 నుంచి 28 వరకు
  • కాలేజీలో స్టూడెంట్స్ ఓరియెంటేషన్ – ఆగస్టు 24 నుంచి 31 వరకు
  • డిగ్రీ తరగతులు ప్రారంభం (సెమిస్టరు-1) – సెప్టెంబర్ 1

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =