1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

TSPSC Releases Notification for Recruitment to the 1392 Junior Lecturers Posts,TSPSC Releases Notification,TSPSC Notification,Recruitment to Jr Lecturers Posts,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2022,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2022,Telangana Govt Notifications 2022,TSPSC Latest News and Updates,TSPSC News and Live Updates

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో ఉండే జూనియర్ లెక్చరర్లు (జేఎల్) నియామకానికి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 27 సబ్జెక్ట్స్ కు సంబంధించి మొత్తం 1392 పోస్టులను భ‌ర్తీ చేయనున్నట్టు తెలిపారు.

ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల కోసం 2022, డిసెంబర్ 16వ తేదీ నుంచి 2023, జనవరి 6వ తేదీ వరకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే రాత పరీక్షను 2023, జూన్/జూలై నెలల్లో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 4 =