తెలంగాణ పీహెచ్‌సీల యొక్క ‘మానిటరింగ్ హబ్’ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Health Minister Harish Rao Inaugurates Telangana PHC’s Monitoring Hub at Koti DPH Office, Harish Rao Inaugurates Telangana PHC’s Monitoring Hub at Koti DPH Office, Telangana PHC’s Monitoring Hub at Koti DPH Office, Koti DPH Office, Telangana PHC’s Monitoring Hub, Telangana Health Minister Harish Rao, Harish Rao, PHC’s Monitoring Hub, Primary Health Centres, 887 Primary Health Centres, Virtual monitoring of PHCs, Telangana PHC’s Monitoring Hub News, Telangana PHC’s Monitoring Hub Latest News And Updates, Telangana PHC’s Monitoring Hub Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కోఠిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(డీపీహెచ్‌) కార్యాలయంలో రాష్ట్రంలోని పీహెచ్‌సీల కోసం ఏర్పాటు చేసిన ‘మానిటరింగ్‌ హబ్‌’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 887 పీహెచ్‌సీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటిని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీలతో అనుసంధానం చేశామని చెప్పారు. ఇకపై ఉన్నతాధికారులు ఇక్కడి నుంచే మానిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఏవైనా ఔట్ బ్రేక్స్ కలిగినప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటుగా, డాక్టర్లు తమ పీహెచ్‌సీలలోని ఫార్మసీ, ల్యాబ్ ను మానిటర్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. అలాగే మెడికల్ కాలేజీలు, జిల్లా హాస్పిటల్ తో సంప్రదించి స్పెషాలిటీ సేవలు అందించే అవకాశం కలుగుతుంది. సీసీ కెమెరాలతో సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుందని, ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం దేశంలో మొదటిసారి అని మంత్రి పేర్కొన్నారు.

“తెలంగాణలో ప్రాథమిక వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారు. 43 పీహెచ్‌సీలకు 67 కోట్లతో కొత్త బిల్డింగ్ లను మంజూరు చేశాం. 372 పీహెచ్‌సీలలో మరమ్మతులను 43 కోట్ల 18 లక్షలతో చేపట్టాము. 1239 సబ్ సెంటర్ల కొత్త భవనాలకు నిధులు మంజూరు చేశాం. ఒక్కో దానికి 20 లక్షల ఖర్చు చేస్తున్నాం. అన్నిటికి కలిపి మొత్తంగా 247 కోట్లు వెచ్చించాం. 1497 సబ్ సెంటర్ లను ఒక్కోదానికి 4 లక్షల చొప్పున 59 కోట్లతో మరమ్మత్తులు చేపట్టాము. ఇక మునుగోడు ఉపఎన్నిక వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ ఆలస్యమైంది. 969 పోస్టులకు మెరిట్ లిస్ట్ ప్రకటించాము. వారం పది రోజుల్లో నియామక పత్రాలు అందిస్తాం. దీంతో అన్ని పీహెచ్‌సీలల్లో డాక్టర్లు ఉంటారు. పల్లె దవాఖానల కోసం 1569 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతుంది. రాష్ట్రంలో 331 బస్తి దవాఖానలు పనిచేస్తున్నాయి. వీటిని 500 కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీటిల్లో ఇప్పటివరకు 2.11 కోట్ల ఓపీ నమోదైంది. వీటి వల్ల ఉస్మానియా, గాంధీ,ఫీవర్ వంటి హాస్పిటల్లపై ఒత్తిడి తగ్గింది” అని మంత్రి తెలిపారు.

“2019లో ఉస్మానియా హాస్పిటల్ లో 12 లక్షలు ఓపీ ఉంటే, ఈ ఏడాది 5 లక్షలకు తగ్గింది. గాంధీలో 6.5 లక్షల నుండి 3.70 లక్షలకు, నిలోఫర్ లో 8 లక్షల నుండి 5.5 లక్షలకు, ఫీవర్ హాస్పిటల్ లో 4 లక్షల నుండి 2 లక్షలకు తగ్గింది. దీంతో అక్కడ సర్జరీల పెరిగాయి. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 36.20 లక్షల మందికి 6.46 కోట్ల టెస్టులు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసానన్న సంతృప్తి కలిగింది. స్టాఫ్ నర్స్, 1165 స్పెషలిస్ట్ డాక్టర్ నోటిఫికేషన్ త్వరలో ఇస్తాం. కేంద్రం 157 మెడికల్ కాలేజ్ లు ఇచ్చినా ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాం. స్వయంగా నేనే పత్రాలు తీసుకొని వెళ్తాను. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుంటారా?” అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + sixteen =